ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించగానే హైదరాబాద్లో మందుబాబులు అప్రమత్తమయ్యారు. తమకు దగ్గరలో ఉన్న వైన్ షాపుల వద్ద బారులు తీరారు. రేపటి నుంచి మందు దొరుకుతుందో దొరకదోననే ఆత్రుతతో కరోనా నిబంధనలు పాటించకుండానే మందు ప్రియులు ఎగబడిపోయారు.
హైదరాబాద్ పాతబస్తీ, శంషీర్ గంజ్, ఛత్రినాక, ఉప్పుగూడా, చంద్రాయణగుట్ట, కేశవగిరి ప్రాంతాల్లోని అన్ని వైన్ షాప్ల వద్ద ఇదే పరిస్థితి. కిరాణా షాపులు, కూరగాయల మార్కెట్లు, మాంసం దుకాణాల ఎదుట కూడా జనాలు పెరిగిపోయారు.
ఇవీ చదవండి: మూడోదశలో చిన్నారులకు కరోనా ముప్పు