కరోనా వేళ ప్రజలకు ఆహారపు అలవాట్లపై స్పృహ పెరిగింది. రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో మాంసం కోసం బారులు తీరారు. ఆదివారం కావడం వల్ల హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్ నగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, భోలక్పూర్, కవాడిగూడ, గాంధీ నగర్ తదితర ప్రాంతాల్లోని మాంసం దుకాణాలు కిటకిటలాడాయి.
లాక్డౌన్ మినహాయింపు సమయంలో దుకాణాల ముందు పెద్ద సంఖ్యలో వరుసలో నిలబడ్డారు. కరోనా నిబంధనలు విస్మరించారు.
ఇదీ చదవండి: 'హ్యాపీనెస్ కిట్'తో నెలసరి సమస్యలకు పరిష్కారం!