ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8కిలో మీటర్ల ఎత్తు మధ్య స్థిరంగా కొనసాగుతూ నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు ఉత్తర-దక్షిణ ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల వద్ద ఉత్తర ఛత్తీస్ఘడ్ పరిసర ప్రాంతాల నుంచి తెలంగాణ వరకు వ్యాపించి ఉందని తెలిపింది.
వీటి ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు... ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యపేట, మహాబూబాబాద్, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి: ప్రకృతిని పరిరక్షిస్తేనే మనిషికి భవిత