రాష్ట్రంలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిశా ఉత్తర ప్రాంతంలో అల్పపీడనం... దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. తూర్పు, పశ్చిమ గాలుల మధ్య 4.5 కిలోమీటర్ల ఎత్తున అస్థిరత ఏర్పడిందని అన్నారు. వీటి ప్రభావంతో ఒక మాదిరి లేదా భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు. అయితే శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు 180 ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.
ఇదీ చూడండి : లేజర్హాబ్గా ఆవిర్భవించనున్న భాగ్యనగరం..!