హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. భాగ్యనగరంలోని ఉప్పల్, శాంతినగర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 60.8 మి.మీలు కురవగా.. బుధవారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు 40 మి.మీల వర్షపాతం నమోదైంది. హన్వాడలో 70.3, ఇంగుర్తిలో 62.8, సరూర్‌నగర్‌లో 46.8, ఖైరతాబాద్‌లో 41.5 మిల్లిమీటర్ల వాన పడింది.
అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు
దేశం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ బుధవారం ప్రారంభమైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. తెలంగాణలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
ఇవీ చూడండి: "రేపటినుంచి పూర్తిస్థాయిలో బస్సులు నడిపేందుకు చర్యలు"