ETV Bharat / state

అలర్ట్: రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు భారీ వర్షాలు - rains in telangana

తెలంగాణలో రాగల మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని... వాతావరణ కేంద్రం ప్రకటించింది. అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.

Heavy rains in telangana state
Heavy rains in telangana state
author img

By

Published : Sep 16, 2020, 5:45 PM IST

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మహబూబ్​నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణ పేట జిల్లాలలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.

అలాగే అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతంలో దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా సెప్టెంబర్ 20న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.

తెలంగాణ దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఛత్తీస్​గఢ్ ప్రాంతాలలో కొనసాగుతున్న అల్పపీడనం ఈరోజు (సెప్టెంబరు 16 వ తేదీన) ఉదయం బలహీనపడిందన్నారు. దీనికి అనుబంధముగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తెలంగాణ దాని పరిసర ప్రాంతాలలో 3.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉందని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.