ETV Bharat / state

మాండౌస్​ తుపాన్​ ఎఫెక్ట్​.. నెల్లూరును ముంచెత్తిన వర్షాలు​.. - ఈదురుగాలులతో కూడిన వర్షాలు

MANDOUS EFFECT IN NELLORE: మాండౌస్​ తుపాన్​ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఏపీలోని నెల్లూరు జిల్లా వణికిపోతుంది. గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

MANDOUS EFFECT IN NELLORE
మాండౌస్​ తుపాన్​
author img

By

Published : Dec 10, 2022, 6:03 PM IST

MANDOUS EFFECT IN NELLORE: మాండౌస్ తుపాన్​ ప్రభావంతో గత రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వానల కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. కనకమహాల్ సెంటర్ , కేవీఆర్ పెట్రోల్ బంక్ సెంటర్, కరెంట్ ఆఫీస్ సెంటర్, పొదలకూరు రోడ్డు, పద్మావతి సెంటర్, డైకాస్​ రోడ్​లో వరద నీరు భారీగా చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో వరి నాట్లు, నారుమడలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఈదురుగాలులతో కూడిన వర్షాలు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికి తోడు చల్లటి గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇళ్లలో నుంచి బైటకు రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని సంగంలో 10సెం.మీ, కలువాయి 9 సెం.మీ, ఏఎస్ పేట 8 సెం.మీ, ఆత్మకూరు 7 సెం.మీ, అనంతసాగరంలో 6 సెం.మీ వర్షపాతం నమోదు కాగా.. మిగతా చోట్ల మోస్తరు వర్షం కురుస్తోంది.

జలాశయానికి పోటెత్తున్న వరద: నెల్లూరు జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి పెన్నా జలాశయానికి 12 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. జలాశయంలో ఇప్పటికే 70 టీఎంసీల నీటి నిల్వ ఉండగా ముందస్తు జాగ్రత్తగా జలాశయం నుంచి 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పెన్నా పరివాహక ప్రాంతాలైన అనంతసాగరం, చేజర్ల, కలువాయి, ఆత్మకూరు, సంగం మండలాల అధికారులను అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు

చేజర్లలో పొంగుతున్న వాగులు: తుపాన్​ ప్రభావంతో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు.. చేజర్ల‌ మండలంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తూర్పు కంభంపాడు పాడు, మడపల్లి వద్ద నల్లవాగు పొంగి ప్రవహిస్తుండటంతో సుమారు 10 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గొల్లపల్లి, ఓబులాయపల్లి మధ్యలో పందల వాగు పొంగి ప్రవహిస్తుండటంతో ప్రమాదాలు జరగకుండ ముళ్ల కంచె వేసి రాకపోకలు నిలిపి వేశారు.

నెల్లూరు జిల్లాలో మాండౌస్​ తుపాన్​ ఎఫెక్ట్​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.