రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్ నగరంలోనూ రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఎల్‌బీనగర్, హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, నాంపల్లి, కోఠి, బేగంబజార్, అంబర్‌పేట, సికింద్రాబాద్, జేబీఎస్, కార్ఖానా, నాగారం, నాగోల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేని వాన వల్ల నాలాలు పొంగిపొర్లుతున్నాయి. చాలాచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇదీ చూడండి: CM KCR: పేదలకు ఉచిత వైద్యం అందించే లక్ష్యంతో సర్కారు కృషి