భాగ్యనగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. కొన్నిప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, పటాన్‌చెరు, కూకట్‌పల్లి ప్రాంతాల్లో వర్షం పడింది. మూసాపేట్, జీడిమెట్ల, షాపూర్ తదితర ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు వర్షం పడింది.
తటాకాలను తలపిస్తున్న రోడ్లు
వర్షపునీటితో కూకట్‌పల్లి శేషాద్రికాలనీలోని రోడ్లు తటాకాలను తలపిస్తున్నాయి. వీధుల వెంబడి వరద నీరు కాలువ ప్రవాహంలా పారింది. పాదచారులు, ద్విచక్రవాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
పొంగిన డ్రైనేజీలు, స్తంభించిన ట్రాఫిక్
వరదనీటితో పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి పొర్లాయి. సాయంత్ర సమయం కావడం వల్ల కార్యాలయాల నుంచి తిరుగొచ్చేవారు, వ్యాపారస్థులు వర్షం వల్ల ఇబ్బంది పడ్డారు. కొన్నిచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఇవీ చూడండి: పచ్చని మొక్కలతో ఆహ్లాదం పంచుతున్న పొదరిల్లు