ETV Bharat / state

హైదరాబాద్‌లో వరద ముంపులోనే పలు కాలనీలు.. నిద్ర, తిండి లేక జనం అవస్థలు

Hyderabad Rains: హైదరాబాద్‌లో రాత్రి కురిసిన వర్షానికి పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. వాన తగ్గి గంటలు గడిచినా....ఇంకా వరదలోనే జనం మగ్గుతున్నారు. ప్రతిసారి ఇదే పరిస్థితి తలెత్తుతున్నా.... పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు వచ్చి చూసి వెళ్తున్నారు కానీ, కనీస పరిష్కారం చూపించడం లేదని వాపోతున్నారు.

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీట మునిగిన పలు కాలనీలు

author img

By

Published : Oct 13, 2022, 7:13 AM IST

Updated : Oct 13, 2022, 10:00 AM IST

హైదరాబాద్‌లో అర్థరాత్రి వాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లు పూర్తిగా మునిగిపోవటంతో ప్రజలు రోడ్లపై ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శివారులోని పేట్‌ బషీరాబాద్‌ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. చుట్టు పక్కల ప్రాంతాల్లో అపార్టుమెంట్‌లు కడుతుండటంతో వరద నీరు నిలిచిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో వస్తువులన్నీ తడిచిపోయాయని...నిలువ నీడలేని పరిస్థతి తలెత్తిందని వాపోతున్నారు.

కొన్ని నెలలుగా వర్షానికి నీటమునిగిపోతున్నప్పటికీ...ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపించారు. తమకు సాయం చేయాలని విజ్ఞప్తి చేసినా...మాటలు హామీలకే పరిమితం అవుతున్నాయని పేర్కొన్నారు.

సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో రహదారులపై భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మోకాళ్ల లోతులో నీరు ప్రవహించడంతో ద్విచక్రవాహనాలు పాడైపోతున్నాయి. సైకిళ్లపై వెళ్లే కొంతమంది విద్యార్థులు అదుపు తప్పి పడిపోయారు. అల్వాల్‌లోని పలు కాలనీల్లో ఇల్లు నీట మునిగాయి. బోయిన్‌పల్లిలోని రామన్నకుంట చెరువు నుంచి నీరు రహదారిపై నుంచి ప్రవహిస్తోంది. ఖార్ఖాన గణేష్ నగర్ కాలనీలో అపార్ట్మెంట్లలోకి వరద చేరింది. వెస్ట్ వెంకటాపురం ప్రాంతంలో ఇళ్లలోకి వరద రావటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీట మునిగిన పలు కాలనీలు

ఇవీ చదవండి:

Last Updated : Oct 13, 2022, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.