ETV Bharat / state

జంటనగరాల్లో పాత రికార్డులు బద్ధలు - రాజధాని నగరంలో కుంభవృష్టి

వాయుగుండం ప్రభావంతో జంట నగరాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజా జీవనం స్తంభించిపోయింది. నగర ప్రజానీకం జడివానలో తడిసి ముద్దయ్యారు. ఉదయం నుంచి ఏకధాటిగా కురవడంతో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. రాజధానిలోని పలు లోతట్టు ప్రాంతాలు జలసంద్రంలో చిక్కుకున్నాయి.

heavy-rain-in-twin-cities
జంటనగరాల్లో పాత రికార్డులు బద్ధలు
author img

By

Published : Oct 14, 2020, 2:04 AM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వరుణుడు జంటనగరాలను ముంచెత్తాడు. ఉదయం నుంచి ఏకధాటిగా కురిసిన కుంభవృష్టి వర్షంతో రికార్డుస్థాయిలో గణాంకాలు నమోదయ్యాయి. రహదారులపైకి వరద నీరు చేరడంతో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి.

ఘట్‌కేసర్ సింగపూర్‌ టౌన్‌షిప్‌లో అత్యధిక వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాల్లో 20 సెంటీ మీటర్లకు పైగా భారీస్థాయిలో గణాంకాలు నమోదయ్యాయి. రహదారులపై ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో 25.5 సెం.మీ వర్షపాతం నమోదైంది.

సంఖ్యప్రాంతంవర్షపాతం(సెంమీ)
1ఘట్‌కేసర్‌ సింగపూర్‌ టౌన్‌షిప్‌31.9
2హయత్‌నగర్‌29.13
3హస్తినాపురం27.93
4అబ్దుల్లాపూర్‌మెట్26.15
5ఇబ్రహీంపట్నం 25.35
6సరూర్‌నగర్26.78
7ఉప్పల్24.8
8దండుమైలారం24.4
9మేడిపల్లి23.2
10కీసర25.6
11ముషీరాబాద్‌24.5
12చార్మినార్ 21.6
13మల్కాజ్‌గిరి21.6
14సికింద్రాబాద్ 21.5
15వలిగొండ25.5

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.