హైదరాబాద్ వర్షం మరోసారి వాహనదారులకు చిక్కులు తెచ్చిపెట్టింది. మధ్యాహ్నం బోయిన్పల్లి, అల్వాల్, బొల్లారం, మారేడుపల్లి, బేగంపేట, ప్యాట్నీ, ప్యారడైస్, చిలకలగూడ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గంట నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడం వల్ల వర్షపునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇవీ చూడండి:రాష్ట్రవ్యాప్తంగా పాక్షికంగా నడుస్తున్న ఆర్టీసీ బస్సులు