నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, చిలకలగూడ, సీతాఫల్మండి, రైల్వేస్టేషన్, సంతోష్‌నగర్, మాదన్నపేట, చంచల్‌గూడలో ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది.ప్రధాన మార్గాల్లో రహదారులపై వర్షం నీరు పొంగుపొర్లుతోంది. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి మబ్బులు కుమ్ముకునే ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. ఈశాన్య రుతుపవనాలతోపాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటించింది.
ఇదీ చూడండి: అలర్ట్: బయటకు వెళ్తున్నారా... అయితే గొడుగు తీసుకెళ్లండి!