బీభత్సంగా కురిసిన వర్షాలు హైదరాబాద్‌ను ముంచెత్తాయి. కుండపోతగా కురిసిన వానలు.. నగర శివార్లను అతలాకుతలం చేశాయి. మంగళవారం ఉదయం నుంచి ఏకధాటిగా కురిసిన వాన.. సాయంత్రానికి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడం వల్ల జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లపై భారీగా నీరు ప్రవహిస్తూ.. డ్రైనేజీలు పొంగిపొర్లాయి.
ఈ కుండపోత వర్షాలతో బుధవారం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలోకి భారీగా వరద నీరు చేరింది. ఆసుపత్రిలోని సెల్లార్.. చెరువును తలపిస్తోంది. బీ1 బ్లాకు నుంచి వస్తున్న వరద నీరు ప్రవాహానికి కొట్టుకుపోకుండా సిబ్బంది, పలువురు అతికష్టంతో గోడను పట్టుకున్నారు. ఆ వరద ప్రవాహం ఓ జలాశయం నుంచి నీటిని గేట్ల ద్వారా విడుదల చేసినట్లుగా కనిపిస్తోంది. నుంచి నీటిని విడుదల చేసినట్లుగా దర్శనమిస్తోంది. ఈ వరద నీరుతో పలు వాహనాలు మునిగాయి. ఏం చేయాలో తెలీక సిబ్బంది అయోమయంలో ఉండిపోయారు.
ఇదీ చదవండి: భారీ వర్షానికి.. భాగ్యనగరం అతలాకుతలం