ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వాన కురిసింది. వివిధ ప్రాంతాల్లో రహదారులు జలమయ్యాయి. మోకాలి లోతు నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సికింద్రాబాద్, వారాసిగూడ రహదారులపై మోకాలి లోతు నీరు చేరింది.
వర్షం ధాటికి అఫ్జల్ సాగర్ వద్ద ఓ పాత భవనం బాల్కనీ కూలిపోయింది. అక్కడే ఉన్న విద్యుత్ స్తంభం నేలకొరిగింది. దీంతో కొద్దిసేపు ఆ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణపాయం జరగలేదు.
ముషీరాబాద్‌లోని గణేశ్‌నగర్‌లో వరద ప్రవాహానికి పార్కింగ్ చేసిన కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. బాపూజీ నగర్‌లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ అపార్ట్మెంట్ సెల్లార్‌లోకి పెద్ద ఎత్తున నీరు చేరగా అగ్నిమాపక సిబ్బంది మోటార్ల ద్వారా తొలగించారు.
ఇదీ చదవండి: RAINS: ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు