హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉపరితల ద్రోణితో పెద్ద ఎత్తున గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రంగా ఉన్నా సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. సూరారం, జీడిమెట్ల, షాపూర్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బండ్లగూడ జాగీర్, శంషాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇవీచూడండి: పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది