తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉదయం 9:30 గంటల నుంచి కూకట్‌పల్లిలోని పలు ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం పడింది. వర్షపు నీటితో రోడ్లన్ని జలమయమయ్యాయి. వాహనదారులు కొంతమేర ఇబ్బంది పడ్డారు.
కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్ ,కేపీహెచ్‌బీ కాలనీ, ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్, బాలాజీ నగర్, మూసాపేట్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏకదాటిగా వర్షం కురిసింది. బయటకు వచ్చిన ప్రయాణికులు వర్షపునీటిలో అవస్థలు పడాల్సి వచ్చింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని జీడీమెట్ల, కొంపల్లి , బాలానగర్, చింతల్ ప్రాంతాల్లో భారి వర్షం పడింది.