ఏపీలోని గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురంలోని రేకుల ఇంట్లో ఓ వృద్ధురాలు నివాసం ఉంటుంది. ఆమె వాడే కరెంటు.. మహా అయితే ఓ లైటు.. ఓ ఫ్యానుకు మాత్రమే. అది కూడా రోజంతా వాడదు. అయినా.. ఆ పేద వృద్ధురాలికి అధికారులు 2 వేల 953 రూపాయల బిల్లు పంపారు. నెల నెలా వంద రూపాయలలోపే వచ్చే కరెంటు బిల్లు.. ఒకేసారి ఇంతలా వచ్చేసరికి ఆ వృద్ధురాలికి మతి పోయింది. ఇదెలా జరిగిందని.. అధికారులను అమాయకంగా అడుగుతోంది. ఆమె కష్టం తీర్చాల్సింది విద్యుత్ శాఖ అధికారులే.
ఇవీ చూడండి: హీరో నాగశౌర్యకు రూ.500 జరిమానా