తూర్పు గోదావరి జిల్లా తుని మండలం ఎర్ర కోనేరు వద్ద జాతీయ రహదారిపై ఓ బాహుబలి లారీ కనిపించింది. గుజరాత్ నుంచి విశాఖకు భారీ ట్రాన్స్ఫార్మర్ను తరలిస్తున్న ఈ లారీకి 146 చక్రాలు ఉన్నాయి. 16 వరుసల్లో ఎనిమిది చొప్పున 128 చక్రాలు, ఇంజిన్‌కు మరో 18 చక్రాలు ఉన్నాయి. ఈ లారీ రోడ్డుపై వెళ్తుంటే స్థానికులంతా ఆసక్తిగా చూస్తున్నారు.
ఇదీ చదవండి: ఆధార్ ఉంటే రూ.25... లేకుంటే రూ. వంద పెట్టాల్సిందే..!