Heavy Water Flood In Hussain Sagar : గత నాలుగు రోజులుగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా సిటీ శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. హుస్సేన్ సాగర్ పుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు.. ప్రస్తుతానికి నీటి మట్టం 513.62 మీటర్లుగా నమోదైంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీరు మొత్తం హుస్సేన్ సాగర్‌లో చేరుతుంది. నాలుగు తూమ్‌ల నుంచి నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. నీటి మట్టం పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై.. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ వచ్చి పరిశీలన చేశారు.
మళ్లీ రానున్న 24 గంటల్లో వర్షాలు కురిసే నేపథ్యంలో ముంపునకు గురయ్యే దిగువన ఉండే కవాడిపల్లి, మిగిలిన ప్రాంతాల ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. ఇన్‌ఫ్లో ఎక్కువగా వస్తే.. అవుట్ ఫ్లో కూడా ఎక్కువగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో దిగువ ప్రాంతాల్లో ఉండే ప్రజలను ఇప్పటికే అధికారులు హెచ్చరికలు పంపి.. పునరావాస శిబిరాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తలేదు. ఎందుకంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న నీటిని మాత్రమే బయటకు పంపిస్తున్నారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వరదల కోసం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఫిర్యాదులు కూడా స్వీకరిస్తున్నారు. ఎక్కువ ఫిర్యాదు చెట్లు పడిపోయిన ప్రాంతాలు, డ్రైనేజ్ సమస్యలపై కూడా ఎక్కువగా ఫిర్యాదు వస్తున్నాయని జీహెచ్ఎంసీ అధికారులు తెలుపుతున్నారు. ఆ ప్రాంతాల నుంచి వచ్చిన సమస్యలను త్వరితగతిన క్లియర్ చేస్తున్నామని చెపుతున్నారు. రానున్న 24 గంటలలో జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు జిల్లాలకు వాతావరణ భారీ వర్ష సూచనను చేసిన నేపథ్యంలో.. అందుకు తగ్గట్లు అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు.
Himayat Sagar Two gates lifted : హైదరాబాద్‌లోని జంట జలాశయాల్లో వరద ప్రవాహం పెరిగింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో హిమాయత్‌సాగర్ నిండుకుండలా మారింది. ఇంకా ఎగువ నుంచి ప్రవాహం ఎక్కువగా వస్తుందన్న సమాచారంతో ముందుగా.. జలాశయంలోని రెండుగేట్లను ఎత్తి నీటిని మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్‌కు 1200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. రెండు గేట్ల ద్వారా 700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1762.75 అడుగులుగా ఉంది.
ఇవీ చదవండి :