హైదరాబాద్లో కుండపోత వర్షం బేగంబజార్లోని వ్యాపార సముదాయాలను ముంచెత్తింది. దుకాణాల్లోకి భారీ వరద నీరు చేరడంతో వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయారు. నగరంలో అత్యంత రద్దీ వ్యాపార కేంద్రంగా పేరొందిన బేగంబజార్ మురికి కూపాన్ని తలపించింది.
పధన్వాడీఖాన్ మార్కెట్లో సెల్లార్లోకి వరద నీరు రావడంతో వస్తువులన్నీ నీట మునిగాయి. రహదారులపై మురికి నీరు చేరడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్ని హామీలు ఇచ్చినా డ్రైనేజీ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చూపడం లేదంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని స్థానిక వ్యాపారస్తులు కోరుతున్నారు.