కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో కరోనాను కట్టడి చేయాలనే నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రంలో రేపటి నుంచి లాక్డౌన్ను విధించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే దుకాణాల సముదాయాలు తెరిచి ఉంటాయని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు మెదక్ జిల్లాలో పలు మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు.
ఈ తరుణంలో ఇలా బారులు తీరడం వల్ల కరోనా ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు ఎక్సైజ్ అధికారులు, వైన్స్ షాప్స్ వద్ద బారులు తీరిన వారిని కరోనా నిబంధనలు పాటించాలని చెప్పాల్సింది పోయి అక్కడే ఉండి చోద్యం చూడడం విశేషం.
- ఇదీ చూడండి: రేపట్నుంచి 10 రోజులపాటు రాష్ట్రంలో లాక్డౌన్