Heavy Competition for Fancy Number at Hyderabad : ఫ్యాన్సీ నంబర్లతో రవాణా శాఖకు కాసుల పంటపండింది. ఇవాళ ఒక్కరోజే ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి ఫ్యాన్సీ నంబర్లతో అరకోటి వరకు ఆదాయం సమకూరింది. ఈ వేలంలో ఏడుగురు వాహన యజమానులు పోటీపడి ఫ్యాన్సీ నంబర్లను కైవసం చేసుకున్నారు. దీంతో ఒక్కరోజే రవాణా శాఖకు(Telangana Transport Department) రూ.45,98,490 ఆదాయం వచ్చింది. అత్యధికంగా TS 09 GE 9999 నంబర్‌కు రూ. 17,35,000 ఆదాయం కాగా అత్యల్పంగా TS 09 GF 0007 నంబర్‌కు రూ.1,01,999 ఆదాయం సమకూరినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు.
ఈ వివిధ నంబర్లకు వేలం ద్వారా సమకూరిన ఆదాయం :
- TS 09 GE 9999 నంబర్‌కు రూ. 17,35,000 ఆదాయం సమకూరింది. ఈ నంబర్‌ను కీస్టోన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారు దక్కించుకున్నారు.
- TS 09 GF 0005 నంబర్‌కు రూ. 3,75,000 ఆదాయం వచ్చింది. ఈ నంబర్‌ను ఈ వేలంలో లలిత జ్యువెల్లరీ ప్రైవేట్ లిమిటెడ్ (lalitha jewellery)వారు దక్కించుకున్నారు.
- TS 09 GF 0001 నంబర్‌కు రూ. 3,50,000కు ఆదాయం. ఈ నంబర్‌కు వేలం పాట పాడి ఎన్.బీ.కే టాలెంట్ స్టూడియో 3 ఎల్.ఎల్.పీ వారు దక్కించుకున్నారు.
- TS 09 GF 0099 నంబర్‌కు రూ. 2,31,999 ఆదాయం సమకూరింది. ఈ నంబర్‌ను ఈ వేలంలో ద్యాప వరోధినిరెడ్డి దక్కించుకున్నారు.
- TS 09 GF 0111 నంబర్‌కు రూ. 2,09,999 ఆదాయం వచ్చింది. ఈ నంబర్‌ను ఈ వేలంలో 99 వెంచర్స్ దక్కించుకున్నారు.
- TS 09 GE 0027 నంబర్‌కు రూ. 1,36,500 ఆదాయం సమకూరింది. ఈ నంబర్‌ను ఈ వేలంలో న్యూలాండ్ లాబోరేటరీస్ లిమిటెడ్ వారు దక్కించుకున్నారు.
- TS 09 GF 0007 నంబర్‌కు రూ.1,01,999 ఆదాయం సమకూరింది. ఈ నంబర్‌ను ఈ వేలంలో హిల్ తీరి ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు దక్కించుకున్నారు.
ఉచిత ప్రయాణ సౌకర్యం అమలుతీరుపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీ
Fancy Number Competition in October at Hyderabad : హైదరాబాద్‌లో ఫ్యాన్సీ నంబర్లకు గతంలో కూడా భారీ డిమాండ్ ఉంది. రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో వీటికి అధిక డిమాండ్ ఉంటోంది. అక్టోబర్ నెలలో జరిగిన ఫ్యాన్సీ నంబర్ల వేలం పాటలో రూ. 53 కోట్ల ఆదాయం వచ్చింది. రంగారెడ్డి, హైదరాబాద్‌లలో రూ.38.48 కోట్ల ఆదాయం సమకూరింది. ముఖ్యంగా 9999, 0001, 0007, 0009 నంబర్లకు ఎక్కువ డిమాండ్ ఉంది.
సచివాలయంలో సీఎం వరుస సమీక్షలు - రైతుబంధు నిధుల విడుదల, డ్రగ్స్ నియంత్రణకు ఆదేశాలు
షియా మహిళలను ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలంటూ హైకోర్టు ఉత్తర్వులు