భానుడి భగభగల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం దొరికింది. నిన్న, మొన్నటితో పోలిస్తే రాష్ట్రంలో సూర్యుడి ప్రతాపం ఈరోజు కాస్త తగ్గింది. వడగాల్పుల ప్రభావం సైతం తక్కువగానే ఉంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా భోరాజ్లో అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
నల్గొండ, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 44.4 డిగ్రీలు, జగిత్యాల జిల్లా నేరెళ్లలో 44.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ఇదీ చూడండి..
గుడ్న్యూస్.. భానుడి భగభగల నుంచి కాస్త రిలీఫ్.. మంగళవారమే మొదలు!