ETV Bharat / state

మండుతున్న ఎండలు.. గరిష్ఠ ఉష్ణోగ్రత ఎక్కడంటే..? - HEATWAVE IN PARTS OF TELANGANA

రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వడగాల్పుల భయంతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. పగటిపూటే కాదు రాత్రి ఉష్ణోగ్రతలూ అసాధారణంగా పెరుగుతున్నాయి.

మండుతున్న ఎండలు.. గరిష్ఠ ఉష్ణోగ్రత ఎక్కడంటే..?

author img

By

Published : Apr 23, 2022, 5:26 PM IST

రాష్ట్రంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం నుంచే భగ్గుమంటున్నాడు. ఫలితంగా బయట అడుగు వేస్తేనే.. నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టుగా అనిపిస్తోంది. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలన్నా.. వడగాల్పుల భయంతో ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. తాజాగా నిర్మల్​ జిల్లా కుబీర్​, ఆదిలాబాద్​ జిల్లా బోరాజ్​లలో అత్యధికంగా 42.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు
రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు

ములుగు జిల్లాలోని మేడారంలో 42.2 డిగ్రీలు, ఆదిలాబాద్​ జిల్లాలోని జైనథ్​, ఆదిలాబాద్​ అర్బన్, నిర్మల్​ జిల్లాలోని తానూర్​లలో 42.0 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

ఇవీ చూడండి..

Hyderabadi Haleem: వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ హలీమ్.. తింటే వదలరంతే!

సీబీఎస్​ఈ సిలబస్​లో 'ప్రజాస్వామ్యం' చాప్టర్ కట్.. ఇంకా ఎన్నో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.