Heat Effect on Bus Drivers in Hyderabad : రాష్ట్రం ఎండలతో మండిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో మిట్ట మధ్యాహ్నం వేడి అధికంగా ఉన్నందున ప్రజలు అల్లాడుతున్నారు. ఆదివారం నల్గొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 46.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే రాష్ట్రంలో అత్యధికం. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని మండలాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్‌లో 40 శాతం కంటే ఎక్కవ తేమ శాతం నమోదైంది. నల్గొండలో అత్యంత అల్పంగా 17 శాతం నమోదైంది. మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే వీలుందని హైదాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.
Telangana Weather News Today : రాష్ట్రంలో ఎండలు ఎక్కువగా ఉన్నా.. ఆర్టీసీ డ్రైవర్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చుతున్నారు. ఒకవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. మరోవైపు ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించి విధులు నిర్వహిస్తున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలు రోజు రోజుకు ఎక్కవవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో.. సుమారు 2,800 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ప్రతిరోజు ప్రమాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు.. ఎండవేడిమికి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొద్దిరోజులుగా 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు ఉష్రోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. హైదరాబాద్ పరిధిలో పనిచేసే డ్రైవర్లు ట్రాఫిక్ కారణంగా 9 గంటలకు పైగా విధులు నిర్విర్తించాల్సి వస్తుండటంతో వారు ఒత్తిడికి గురవుతున్నారని చెబుతున్నారు.
"గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. మాకు డిపోల్లో మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు. పని చేసే సమయం పెరుగుతోంది. వేడి వల్ల ఒత్తిడి పెరుగుతోంది. కాస్త సమయం దొరికినప్పుడు చల్లగా ఏదైనా తాగి డ్రైవ్ చేస్తున్నాను." ఆర్టీసీ బస్సు డ్రైవర్, హైదరాబాద్
"ఎండ తీవ్రత ఎంత పెరిగినా పని చేయాల్సిందే.. మేమే ఆగిపోతే ప్రయాణికులు ఇబ్బందులు పడతారు. ఎండ వేడిని తట్టుకునేందుకు మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మజ్జిగ నీళ్లు, నిమ్మకాయ నీళ్లు.. తదితర చల్లని వాటిని మా వెంట తెచ్చుకుని డ్యూటీ చేస్తున్నాం." -ఆర్టీసీ బస్సు కండక్టర్, హైదరాబాద్
RTC Bus Drivers Problems in Hyderabad : ఎండవేడి నుంచి తట్టుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం.. డిపో కేంద్రాల్లో మజ్జిగను అందిస్తోంది. ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు వడగాలులు వీయడంతో డ్రైవర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మాస్క్‌లు వేసుకున్నా.. వేడి గాలుల నుంచి తట్టుకోలేకపోతున్నామని అంటున్నారు. ఉద్యోగమే వృత్తిగా భావించి వేడిమి నుంచి తట్టుకోవడానికి తగు జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో తాగిన నీరు తాగినట్టుగానే చెమట రూపంలో బయటకి రావడంతో పాటు డీహైడ్రేషన్ బారిన పడుతున్నామని చెబుతున్నారు.
ఇవీ చదవండి :