తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్పై శ్రీకాకుళం జిల్లా సోంపేట న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. అయితే.. కేసు డైరీ రాని కారణంగా.. విచారణను న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు.. కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కూడా సోమవారానికి వాయిదా పడింది.
పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి.. నామినేషన్ల విషయంలో వైకాపా, తెదేపా నేతల మధ్య తలెత్తిన వివాదం కేసులో... అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు.
ఇదీ చదవండి: 'పేట్లబురుజు'.. దేశంలోనే ఉత్తమ పోలీస్ ట్రైనింగ్ సెంటర్