ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా... హైదరాబాద్‌లో ఆరోగ్య పరుగు నిర్వహించారు. ఓ ఆంగ్ల పత్రిక ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన పరుగులో పలువురు వైద్యులు, యువత పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సంజీవయ్య పార్క్ నుంచి ప్రారంభమైన పరుగు ట్యాంక్ బండ్ చుట్టూ కొనసాగింది. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయమం చేస్తే... గుండె వ్యాధులను దూరం చేయవచ్చునని వైద్యులు సూచించారు.
ఇవీ చూడండి: పెద్దమ్మతల్లి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు