ETV Bharat / state

' నేటి నుంచి పోలీస్, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సినేషన్​' - రేపటి నుంచి పోలీస్, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సినేషన్​

నేటి నుంచి పోలీస్, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సిన్​ ఇస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. హైదరాబాద్​లో ప్రభుత్వ ఆస్పత్రుల హెచ్‌వోడీలు, సూపరింటెండెంట్లతో మంత్రి సమావేశమయ్యారు.

health minister eetala rejender met with govt hospitals hod' and superintendents in hyderabad
'రేపటి నుంచి పోలీస్, రెవెన్యూ సిబ్బందికి వాక్సినేషన్ '
author img

By

Published : Feb 5, 2021, 7:12 PM IST

Updated : Feb 6, 2021, 12:18 AM IST

ఆరోగ్య శాఖను బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ చెప్పారు. హైదరాబాద్​లో ప్రభుత్వ ఆస్పత్రుల హెచ్‌వోడీలు, సూపరింటెండెంట్లతో మంత్రి సమావేశమయ్యారు. కొవిడ్‌ తర్వాత వైద్య రంగంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్లు తెలిపారు. వైద్య శాఖలో దాదాపు 1400 మందికి పదోన్నతులు ఇచ్చామన్నారు. వైద్య విధాన పరిషత్‌లో దాదాపు 700 మందికి పదోన్నతులు ఇవ్వటంతో ఆరోగ్యశాఖలో సంపూర్ణంగా పదోన్నతుల ప్రక్రియ పూర్తయిందిని చెప్పారు.

కొవిడ్ తగ్గుముఖం పట్టిందని.. జిల్లా ఆస్పత్రుల్లో ఇప్పటికే సాధారణ సేవలు ప్రారంభించామన్నారు. కొవిడ్ బాధితులకు గాంధీ, చెస్ట్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని... నేటి నుంచి పోలీస్, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సిన్​ ఇస్తామని ప్రకటించారు.

గాంధీ ఆస్పత్రిలో రూ.35 కోట్లతో అవయవాల మార్పిడికి అధునాతన శస్త్రచికిత్సల విభాగం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సరోజినీదేవి ఆస్పత్రిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని.. నిమ్స్‌ క్యాన్సర్‌ విభాగంలో రూ.10 కోట్లతో మరో 50 పడకలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వైద్య రంగానికి వచ్చే బడ్జెట్‌లో మరిన్ని నిధుల కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎప్పటికప్పుడు వైద్యుల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైద్య రంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు.

ఇదీ చదవండి: నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై నేతలతో సీఎం సమీక్ష

Last Updated : Feb 6, 2021, 12:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.