ETV Bharat / state

పండుగలు ఇంట్లోనే జరుపుకోండి: ఈటల - ఈటల రాజేందర్​ తాజా వార్తలు

కొత్త రకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న వైద్యనిపుణుల హెచ్చరికలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఇప్పటి వరకు ఏడుగురికి కరోనా నిర్ధరణయిందని... వైరస్ రకాన్ని తెలుసుకునేందుకు నమూనాలను సీసీఎంబీకి పంపినట్లు అధికారులు చెప్పారు.

health minister eetala rajender review on latest corona virus in hyderabad
పండుగలను ఇంట్లోనే జరుపుకోండి: ఈటల రాజేందర్​
author img

By

Published : Dec 24, 2020, 10:51 PM IST

కరోనా వైరస్ స్ట్రెయిన్​తో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ తొమ్మిదో తేదీ నుంచి ఇప్పటివరకు యూకే నుంచి, యూకే మీదుగా రాష్ట్రానికి వచ్చిన 1200 మందిలో 846 మందిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహిస్తే అందులో ఏడుగురికి పాజిటివ్ నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. వారిలో ఉన్న వైరస్ రకాన్ని తెలుసుకునేందుకు నమూనాలను సీసీఎంబీకి పంపినట్లు చెప్పారు. వారిని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నామని, వారిని కలిసిన వారందరినీ ట్రేస్ చేస్తున్నట్లు అధికారులు వివరించారు.

అప్రమత్తంగా ఉండాలి

నెగెటివ్ వచ్చిన వారిని కూడా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. కొత్త రకం వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాబోయే క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకలను ఇంటికే పరిమితమై జరుపుకోవాలని సూచించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించిన అన్ని జాగ్రత్తలు పాటించాలని... మాస్క్, భౌతికదూరం, తరచూ చేతులు శుభ్రపరుచుకోవడం చేయాలని చెప్పారు.

70 నుంచి 80 లక్షల మందికి టీకా

కరోనా వ్యాక్సిన్ రాష్ట్రానికి అందిన వెంటనే ప్రజలకు అందించేలా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వ్యాక్సిన్ రవాణా, నిల్వ, పంపిణీ అంశాలపై అధికారులతో మాట్లాడారు. వ్యాక్సిన్ వేసేందుకు పదివేల మంది వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చామని... ఒక్కొక్కరు రోజుకు వంద మందికి టీకా వేస్తే పదిలక్షల మందికి రోజుకి వ్యాక్సిన్ వేయగలమని అధికారులు చెప్పారు. మొదటి దశలో 70 నుంచి 80 లక్షల మందికి టీకా వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని.. హెల్త్, పోలీస్, మున్సిపల్, ఫైర్ సిబ్బందితోపాటు వయసు మీద పడిన వారికి మొదటి దశలో టీకా ఇవ్వనున్నట్లు చెప్పారు. మొదటి డోసు వేసిన 28 రోజుల తర్వాత రెండో డోసు వేయాలని... అందుకు అవసరమైన సాఫ్ట్​వేర్ సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.

డయాగ్నస్టిక్ మినీ హబ్​లు

వ్యాక్సిన్ సరఫరాకు అవసరమైన కోల్డ్ చైన్, మ్యాపింగ్, సిబ్బందికి శిక్షణ, వాక్సిన్ కేంద్రాల్లో అవసరమైనన సదుపాయాల్లో ఎలాంటి లోపం లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఈటల ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. 11 సీటీ స్కాన్లు, మూడు ఎంఆర్ఐ యంత్రాలను వెంటనే కొనుగోలు చేయాలని, వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న ఆపరేషన్ థియేటర్స్ అన్నింటినీ ఆధునిక సాంకేతిక పద్ధతులకు అనుగుణంగా ఆధునీకరించాలన్నారు. ఇందుకు 30 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. బస్తీ దవాఖానాలు విజయవంతమైయ్యాయని.. రోగులకు వైద్య పరీక్షల కోసం ఎనిమిది డయాగ్నస్టిక్ మినీ హబ్​లను సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. రక్త పరీక్షలతో పాటు ఎక్స్ రే, అల్ట్రా సౌండ్, ఈసీజీ పరీక్షలు చేసేలా నెలాఖరు నుంచి హబ్​లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డయాలసిస్ కోసం రోగులు సుదూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండా కేంద్రాలు, మిషన్ల సంఖ్యను కూడా పెంచాలని ఈటల అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి: ఆందోళన అవసరం లేదు.. అప్రమత్తంగా ఉండండి: కిషన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.