ETV Bharat / state

రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్​ తయారు కావడం గర్వకారణం: ఈటల - భారత్​ బయోటెక్​ కోవాగ్జిన్​ లేటెస్ట్​ వార్తలు

హైదరాబాద్ కేంద్రంగా దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారత్ బయోటెక్ కో వాగ్జిన్​ తయారు చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. వ్యాక్సిన్​ను ముందుగా తెలంగాణ ప్రజలకివ్వాలని ఈటల కోరారు.

health minister eetala rajender on bharat biotech covaxin in hyderabad
రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్​ తయారు కావడం గర్వకారణం: ఈటల
author img

By

Published : Nov 28, 2020, 5:14 AM IST

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్​కు తెలంగాణలో వ్యాక్సిన్ తయారు కావడం గర్వకారణమని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కో వాగ్జిన్​ను ముందుగా తెలంగాణ ప్రజలకివ్వాలని ఈటల కోరారు.

తెలంగాణ గడ్డ మీద వ్యాక్సిన్ తయారవుతుంది కాబట్టి.. ఆ ఫలితం ఇక్కడి ప్రజలకు ముందుగా అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి ప్రజలకు సరిపోయే డోస్​లను ముందుగా ఇవ్వాలని కోరారు. ఈ రోజు భారత్ బయోటెక్​ని సందర్శించేందుకు ప్రధాని మోదీ వస్తున్న సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి: పోలింగ్ శాతం పెరిగేలా ఓటర్లను చైతన్యం చేయండి : పార్థసారథి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.