ETV Bharat / state

ఆయుష్​ విభాగం అధికారులతో మంత్రి ఈటల సమీక్ష - ఆయుష్​ విభాగం అధికారులతో మంత్రి ఈటల సమీక్ష

భారతీయ సంప్రదాయ వైద్య విధానంపై నమ్మకం మరింత పెరిగేలా పనిచేయాలని ఆయుష్‌ డిపార్ట్మెంట్‌ అధికారులను మంత్రి ఈటల రాజేందర్​ ఆదేశించారు. ఎస్‌ఆర్ ​నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో "ఆయుష్ డిపార్ట్​మెంట్​"పై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

health minister eatela rajender review
ఆయుష్​ విభాగం అధికారులతో మంత్రి ఈటల సమీక్ష
author img

By

Published : Dec 9, 2019, 8:30 PM IST

ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది ప్రాచీన భారతీయ వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారన్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. ఎస్‌ఆర్​నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో "ఆయుష్ డిపార్ట్​మెంట్​"పై అధికారులతో మంత్రి సమీక్షించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆయుష్ ఎదగాలని, ప్రజల్లో నమ్మకం నిలబెట్టుకునేలా పని చేయాలని అధికారులకు సూచించారు.

ప్రతి రోజు అన్ని డిస్పెన్సరీల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు. ఆయుష్ కింద పని చేస్తున్న ఆయుర్వేద, హోమియో, యునాని విభాగాల్లో 839 డిస్పెన్సరీలల్లో కావలసిన వసతుల కోసం కోటి రూపాయల నిధులు మంత్రి విడుదల చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి సెంట్రల్ డ్రగ్ స్టోర్ ద్వారా మందులు పంపిణీ చేయాలని.. ప్రతి రోజు నిల్వ వివరాలు నమోదు చేయడమే కాకుండా ... రోగికి అవసరమైన మోతాదులో ప్యాకింగ్ చేయాలని మంత్రి ఆదేశించారు.

ఆయుష్​ విభాగం అధికారులతో మంత్రి ఈటల సమీక్ష

ఇదీ చూడండి: ప్రభుత్వాసుపత్రిలో సేవలపై సిబ్బందిని నిలదీసిన కోమటిరెడ్డి

TG_HYD_59_09_ETELA_REVIEW_AV_3038066 Reporter: Tirupal Reddy గమనిక: ఫీడ్‌ డెస్క్‌ వాట్సప్‌కు వచ్చింది. గమనించగలరు. ()భారతీయ సంప్రదాయ వైద్య విధానంపై నమ్మకం మరింత పెరిగేలా పనిచేయాలని ఆయుష్‌ డిపార్ట్మెంట్‌ అధికారులను మంత్రి ఈటెల రాజేంద్ర ఆదేశించారు. ప్రభుత్వం అవసరమైన సదుపాయాలు అందిస్తుందని, దేశంలో నంబర్ వన్‌గా తీర్చి దిద్దాలని సూచించారు. ఎస్‌ఆర్‌ నగర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో " ఆయుష్ డిపార్ట్మెంట్ " పై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత కాలంలో ఆర్గానిక్ ఆహారంపై జనం శ్రద్ద పెంచుకుంటున్నారని...అల్లోపతీ మందులతో ఇతర సమస్యలు వస్తున్నాయని భావించి చాలామంది ప్రాచీన భారతీయ వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆయుష్ ఎదగాలని, ప్రజల్లో నమ్మకం పోగొట్టుకోకుండా పని చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి రోజు అన్ని దిస్పెన్సరీ ల్లో వైద్యులు అందుబాటులో ఉండాలి మంత్రి ఆదేశించారు. ఆయుష్ కింద పని చేస్తున్నఆయుర్వేద, హోమియో, యునాని విధానాల్లో 839 దిస్పెన్సరీలల్లో కావలసిన వసతుల కోసం 1 కోటి రూపాయలు మొత్తాన్ని మంత్రి విడుదల చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి సెంట్రల్ డ్రగ్ స్టోర్ ద్వారా మందులు పంపిణీ చేయాలని..ప్రతి రోజు నిల్వ వివరాలు నమోదు చేయాలని .. రోగికి అవసరమైన మోతాదులో ప్యాకింగ్ చేయాలని మంత్రి ఆదేశించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.