క్యాన్సర్, గుండె జబ్బులు ఇతర రుగ్మతలతో ప్రాణాలు కోల్పోయిన వారిలో కరోనా పాజిటివ్ ఉన్నప్పటికీ... వారిని దీర్ఘకాలిక వ్యాధుల కారణంగానే మరణించినట్లు పరిగణిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల పేర్కొన్నారు. హైదరాబాద్లో పాజిటివ్ కేసులున్న ప్రాంతాల్లో పనిచేస్తున్న నోడల్ అధికారులు, వైద్యులతో మంత్రి స్వయంగా చర్చించారు. ఒకే కుటుంబంలో ఎక్కువ మంది వైరస్ బారిన పడడం వల్ల కేసుల సంఖ్య పెరుగుతోందని ఈటల పేర్కొన్నారు.
ఇకపై మృతులను ఎలా గుర్తిస్తారంటే..
ఐసీఎంఆర్ నూతన మార్గదర్శకాల ప్రకారం... కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులకు పది రోజులు ఆస్పత్రిలో చికిత్స అందించిన తరువాత ఎలాంటి పరీక్షలు చేయాల్సిన అవసరం లేకుండానే డిశ్చార్జ్ చేసి... 7 రోజుల పాటు హోం ఐసోలేషన్లో ఉంచాలని మంత్రి వెల్లడించారు. కరోనా మరణాలకు సబంధించి ఐసీఎంఆర్ నియమాల ప్రకారం... దీర్ఘకాలిక వ్యాధులు ఉండి... కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి మృతికి గల కారణాలను ప్రొఫెసర్లతో కూడిన బృదం విశ్లేషిస్తోందని తెలిపారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా మృతులను ప్రకటించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : ముద్దు పెట్టినందుకు వెంటాడుతున్న కరోనా..!