ETV Bharat / state

డెంగీ రోజుల్లో ప్లేట్​లెట్ల తగ్గుదల అందుకే! - డెంగీ వైరస్​

డెంగీ వైరస్​ కారణంగా ప్లేట్​లెట్స్​ సంఖ్య తగ్గిపోతుందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ.. దీనికి కారణం ఏమిటనే విషయమై ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఎన్నో రకాల  పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ విషయంలో హైదరాబాద్​ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు పురోగతి సాధించారు. రెండున్నరేళ్ల కృషి తర్వాత పలు విషయాలు కనుగొన్నారు.

HCU Professors Invent Dengue Platelets Count Discrease Reason
డెంగీ రోజుల్లో ప్లేట్​లెట్ల తగ్గుదల అందుకే!
author img

By

Published : Jun 26, 2020, 11:46 AM IST

డెంగీ జ్వరం వస్తే.. శరీరంలో ప్లేట్​లెట్ల సంఖ్య పడిపోతుందని తీవ్ర ఆందోళనకు గురవుతాం. డెంగీ వచ్చిందని తెలియగానే.. రక్తం ఏర్పాటు చేసుకోవడానికి ఇబ్బందులు పడే వారిని గమనిస్తూనే ఉంటారు. అయితే.. డెంగీ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్​లెట్లు ఎందుకు తగ్గిపోతాయనే విషయం వైద్యులు సైతం తేల్చలేకపోయారు. డెంగీకి వైద్యం అందిస్తూ ప్రాణాలు పోకుండా కాపాడగల్గుతున్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్​ కేంద్రీయ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్లు ఈ విషయమై పురోగతి సాధించారు. వర్సిటీలోని స్కూల్​ ఆఫ్​ లైఫ్ సైన్సెస్​ విభాగంలోని బయో టెక్నాలజీ, బయె కెమిస్ట్రీ ప్రొఫెసర్లు ఎం.వెంకటరమణ, ఎస్​.నరేష్​ బాబు కలిసి తమ పరిశోధనలో పలు విషయాలు తెలుకుసున్నారు. దాదాపు రెండున్నరేళ్ల పరిశోధన తర్వాత వారు కనుగొన్న విషయాలను జర్నల్​ ఆఫ్​ వైరాలజీ అనే అమెరికా జర్నల్​లో ప్రచురితమైంది.

తేలిన అంశాలివే..

డెంగీ కారక వైరస్​లో దాదాపు పది రకాల ప్రొటీన్లు ఉంటాయి. ఇందులో నిర్మాణాత్మక (స్ట్రక్చరల్​) ప్రొటీన్లు మూడు కాగా.. మరో ఏడు నిర్మాణాత్మకం కాని (నాన్​ స్ట్రక్చరల్​) ప్రొటీన్లు. నాన్​ స్ట్రక్చరల్​ ప్రొటీన్​ (ఎన్​ఎస్​)-3గా పిలిచే ప్రొటియేజ్​ సమస్యకు కారణమవుతుంది. ఇది నేరుగా రక్తంలోని కణాల్లోకి వెళ్లి వాటిలోని మైటోకాండ్రియాను నిర్వీర్యం చేస్తోంది. మైటోకాండ్రియాలో ప్రొటీన్​ను పట్టి ఉంచే వ్యవస్థ ఉంటుంది. ప్రొటీన్​ కార్యకలాపాలను వైరస్​ ప్రభావితం చేసి.. వాటి పనితీరును దెబ్బ తీస్తుంది. ఫలితంగా ప్లేట్​లెట్స్​ వృద్ధి కావు.

డెంగీ వైరస్​ తరహాలోనే కొవిడ్​-19కు కారణమైన నోవల్​ కరోనా వైరస్​ సైతం కణంలోని మైటోకాండ్రియాపై ప్రభావం చూపిస్తుందని హెచ్​సీయూ ప్రొఫెసర్లు భావిస్తున్నారు. డెంగీ సోకిన వ్యక్తుల్లో చాలా సందర్భాల్లో పరిస్థితి విషమించి హెమరేజిక్​, షాక్​ సిండ్రోమ్​ వస్తున్నాయి. ప్రొటీయేజ్​ను లక్ష్యంగా చేసుకొని కొత్త ఔషదాలు తయారు చేస్తే.. డెంగీ కారణంగా వచ్చే విషమ పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు వీలవుతుందని భావిస్తున్నామని, ఇప్పటి వరకు ప్రొటియేజ్​ను అడ్డుకునే ఔషధాలు రాలేదని.. ఈ పరిశోధన ద్వారా కొత్త మందులు తయారు చేసేందుకు వీలవుతుందని హెచ్​సీయూ ప్రొఫెసర్లు వెంకటరమణ, నరేష్​ బాబులు తెలిపారు.

ఇవీ చూడండి: పచ్చని పండుగ: హరిత తెలంగాణే లక్ష్యం... ప్రతిమొక్కనూ బతికిద్దాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.