ETV Bharat / state

విదేశీ యూనివర్సిటీలతో కలిసి హెచ్​సీయూలో పీహెచ్​డీ కోర్సులు

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంఫిల్ కోర్సులు రద్దు చేయాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. విదేశీ యూనివర్సిటీలతో కలిసి పీహెచ్​డీ కోర్సులను అందించేందుకు కసరత్తు ప్రారంభించనుంది. మోడలింగ్​లో ఎంటెక్ సహా ఆరు కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని హెచ్​సీయూ నిర్ణయించింది. నూతన విద్యా విధానానికి అనుగుణంగా ప్రస్తుత కోర్సులన్నీ పునర్​వ్యవస్థీకరణకు కసరత్తు చేపట్టనుంది.

hyderabad central university
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం
author img

By

Published : Mar 27, 2021, 10:20 PM IST

నూతన విద్యా విధానానికి అనుగుణంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అకడమిక్ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంఫిల్ కోర్సులు రద్దు కానున్నాయి. యూనివర్సిటీలోని 12 స్కూల్స్​లో మూడు.. ప్రస్తుతం ఎంఫిల్ కోర్సులు అందిస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటిని నిలిపివేయనుంది. విదేశీ విశ్వవిద్యాలయాలతో కలిసి సంయుక్త పీహెచ్​డీ కోర్సులు ప్రవేశపెట్టేందుకు కౌన్సిల్ ప్రాథమికంగా అనుమతినిచ్చింది.

కొత్తగా స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ మీడియా స్టడీస్

ఇప్పటికే ఆరు దేశాల యూనివర్సిటీలతో చర్చలు జరుపుతున్న హెచ్​సీయూ, ప్రవేశప్రక్రియ, అర్హతలు, తదితర విధివిధానాలను రూపొందించనుంది. సంయుక్త పీహెచ్​డీ వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి రాకపోవచ్చునని.. ఆ తర్వాత సంవత్సరానికి సిద్ధం కావచ్చునని హెచ్​సీయూ వీసీ ప్రొఫెసర్ అప్పారావు తెలిపారు. ఇప్పటికే 13 స్కూల్స్ నిర్వహిస్తున్న హెచ్​సీయూ.. కొత్తగా స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ మీడియా స్టడీస్ ఏర్పాటు చేయాలని నిర్ణయిచింది.

పునర్​వ్యవస్థీకరణకు కసరత్తు

వచ్చే విద్యా సంవత్సరంలో ఆరు కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. మోడలింగ్, సిమ్యులేషన్స్ కోర్సులో ఎంటెక్, సంగీతంలో మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కోర్సు ప్రారంభించాలని హెచ్​సీయూ నిర్ణయించింది. దూరవిద్యా విధానంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంతో కలిసి ప్రచురణలపై, అప్తమాలిక్ డిస్పెన్సింగ్ ఆప్టిక్స్​లో సర్టిఫికెట్ కోర్సులు, కమ్యూనిటీ ఐ హెల్త్​లో పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఐదేళ్ల ఉర్దూ ఎంఏ ఇంటిగ్రేటెడ్ కోర్సును మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించినట్లు హెచ్​సీయూ వీసీ తెలిపారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా ప్రస్తుత కోర్సులను పునర్​వ్యవస్థీకరణకు కసరత్తు ప్రారంభించాలని నిర్ణయించింది.

ఇదీ చదవండి: నిలకడగా రాష్ట్రపతి ఆరోగ్యం-30న శస్త్రచికిత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.