ETV Bharat / state

ఎన్నికల నగారా... పోలీసుల పహారా - HAWALA MONEY

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందో లేదో హవాలా వ్యాపారులు చెలరేగిపోతున్నారు. ఎన్నికల దృష్ట్యా కోట్ల రూపాయలను అక్రమంగా తరలిస్తున్నారు. అప్రమత్తమైన పోలీసులు హైదరాబాద్​లో కోటి రూపాయలు పట్టుకున్నారు.

ఎన్నికల నగారా... పోలీసుల పహారా
author img

By

Published : Mar 12, 2019, 5:07 PM IST

Updated : Mar 12, 2019, 7:56 PM IST

ఎన్నికల నగారా... పోలీసుల పహారా
హైదరాబాద్​లో హవాలా వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. కొంతమంది వ్యాపారులు ముఠాగా ఏర్పడి అక్రమంగా కోట్ల రూపాయలు తరలిస్తున్నారు. బేగంబజార్, సికింద్రాబాద్, కోఠి ప్రాంతాల్లో ఈ వ్యాపారం రోజు కోట్లలో సాగుతోంది.

కోడ్​తో ఖాకీలు అప్రమత్తం

రోజువారీ వ్యవహారం ఎలా ఉన్నా.. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టి నలుగురు హవాలా వ్యాపారులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 90 లక్షల 50 వేల రూపాయల నగదు పట్టుకున్నారు.

హవాలా వ్యాపారుల మోసం తీరు

దిల్లీలో ఉన్న వ్యక్తి, హైదరాబాద్​లో ఉన్న తన స్నేహితుడికి 5 కోట్లు చెల్లించాలనుకుంటే సదరు వ్యక్తి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమచేయాలి. బ్యాంకు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం చార్జీలు చెల్లించాలి. అంతేకాకుండా ఆదాయపన్ను పరిధిలోకి వస్తున్నందున ... ఆ శాఖకు పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. వీటన్నింటిని తప్పించుకునేందుకు చాలా మంది హవాలా వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.

దిల్లీలో ఉన్న వ్యక్తి డబ్బులు పంపించాలనుకుంటే అక్కడి హవాలా వ్యాపారిని సంప్రదిస్తాడు. హైదరాబాద్​లోని తన స్నేహితుడికి రూ.5 కోట్లు డబ్బులు అందజేయాలని డబ్బులిస్తాడు. ఆ హవాలా వ్యాపారి ఒక కోడ్ చెప్తాడు. దానిని హైదరాబాద్​లోని తన స్నేహితుడికి చెబితే సరిపోతుంది. ఎవరైతే ఆ కోడ్ చెబుతారో.. హైదరాబాద్​లో ఆ వ్యక్తి డబ్బు అందిస్తారు.

ఈ వ్యవహారంతో ఇద్దరికి పన్ను భారం తప్పుతుంది. అందువల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. అందుకే ఈ తరహా వ్యాపారం నిషిద్ధం. ఇలా డబ్బులు చెల్లించినందుకు గాను హవాలా వ్యాపారి కమిషన్ కింద 0.6 శాతం వసూలు చేస్తాడు. ప్రభుత్వానికి చెల్లించే పన్నుతో పోలిస్తే చాలా తక్కువ అయినందున.. వ్యాపారులు హవాలా మార్గం ద్వారా డబ్బులు తరలించడానికే మొగ్గు చూపుతున్నారు.

నలుగురు నిందితుల అరెస్ట్

ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే సోదాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే ఈరోజు టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురు హవాలా వ్యాపారులను అరెస్ట్ చేశారు. నిందితులు గుజరాత్​కు చెందిన దేవేశ్ కొఠారీ, భక్తి ప్రజాపతి, ఉత్తరప్రదేశ్​కు చెందిన ఖాన్ బిలాల్, హైదరాబాద్​కు చెందిన విశాల్ జైన్ లుగా గుర్తించారు. వీరందరూ గత కొంత కాలంగా హవాలా వ్యాపారం నిర్వహిస్తూ... బస్సుల్లో అక్రమంగా డబ్బులు తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు.

అసెంబ్లీ సమయంలో రూ.29కోట్ల పట్టివేత

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 29 కోట్ల రూపాయల డబ్బు తనిఖీల్లో పట్టుబడింది. 3కోట్ల రూపాయల విలువ చేసే బంగారం, వెండిని కూడా స్వాధీనం చేసుకొని ఆదాయపన్ను శాఖకు అప్పగించారు.

హవాలా వ్యాపారులపై కేసులు

అసెంబ్లీ ఎన్నికల సమయంలో 195కి పైగా కేసులు నమోదు చేసి... ఇందులో 120 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేశారు. 17 కేసుల్లో నేరం నిరూపించబడింది. ఈసారి ఎన్నికలకు లెక్క చూపని డబ్బులను పట్టుకునేందుకు మొత్తం 45 ఫ్లయింగ్ స్క్వాడ్​లను ఏర్పాటు చేశారు.

రూ.50 వేల కంటే ఎక్కువ పెట్టుకోవద్దు

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50 వేల రూపాయలకు మించి ఎక్కువ డబ్బును వెంట ఉంచుకోవద్దని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో డబ్బు తీసుకెళ్లాల్సి వస్తే దానికి తగిన ఆధారాలు చూపాలని సూచించారు.

ఇవీ చదవండి:ఓట్ల పండుగతో సూచీల జోరు

sample description
Last Updated : Mar 12, 2019, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.