ETV Bharat / state

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం... శరవేగంగా పూర్తవుతున్న హరితహారం

ఆరోవిడత హరితహారం కార్యక్రమంలో 85 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ దఫా లక్ష్యంగా నిర్దేశించుకున్న 29 కోట్ల 86 లక్షల మొక్కలకుగాను.. ఇప్పటి వరకు 25 కోట్ల 62 లక్షల మొక్కలు నాటారు. వీటిలో కామారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉండగా.. వరంగల్ పట్టణ జిల్లా చివరి స్థానంలో ఉంది. ఏడు జిల్లాలు వంద శాతం లక్ష్యాన్ని అధిగమించాయి. ఇప్పటి వరకు నాటిన మొక్కల్లో 64 శాతం మొక్కలకు జియోట్యాగింగ్ చేయగా.. ఈ ప్రక్రియలో రంగారెడ్డి జిల్లా ముందుంది.

haritha-haram-turns-a-big-success-in-telangana
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం... శరవేగంగా పూర్తవుతున్న హరితహారం
author img

By

Published : Sep 24, 2020, 12:47 PM IST

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. జూన్ 25న నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ముఖ్యమంత్రి మొక్కలు నాటి ఆరోవిడత హరితహారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ దఫాలో 29 కోట్ల 86 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలు, శాఖల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తుండగా మొక్కలు నాటే కార్యక్రమం జోరుగా సాగింది. కొత్త పురపాలక, పంచాయతీరాజ్ చట్టాల్లో పచ్చదనం అంశాన్ని ప్రత్యేకంగా పేర్కొనడం ఫలితమిస్తోంది. 10 శాతం హరితబడ్జెట్‌తో పాటు మొక్కలకు నీరు పోసేందుకు పంచాయతీలకు ట్రాక్టర్లు సమకూర్చడం వంటి చర్యల వల్ల నిధుల కొరత లేకుండా పోయింది. పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాల వల్ల మొక్కలు నాటి పరిరక్షించేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం... శరవేగంగా పూర్తవుతున్న హరితహారం

ముందంజలో ఉన్న కామారెడ్డి..

ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల 62 లక్షల మొక్కలు నాటారు. లక్ష్యంగా నిర్ధేశించుకున్న 29 కోట్ల 86 లక్షల్లో దాదాపు 85.8 శాతం పూర్తైంది. జిల్లాల వారీగా మొక్కలు నాటడంలో కామారెడ్డి ముందంజలో ఉంది. 125 శాతం మేర ఇక్కడ మొక్కలు నాటారు. మేడ్చల్-మల్కాజిగిరి, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లోనూ లక్ష్యాన్ని అధిగమించారు. యాదాద్రి భువనగిరి, వరంగల్ గ్రామీణ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నల్గొండ, ఖమ్మం, వికారాబాద్, వనపర్తి, మెదక్ జిల్లాల్లో లక్ష్యం 90 శాతం దాటింది. నాగర్‌కర్నూల్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, ములుగు, సూర్యాపేట, సిద్దిపేట, జోగులాంబ గద్వాల, జనగాం, కరీంనగర్ జిల్లాలు 80 శాతానికి పైగా లక్ష్యాన్ని చేరాయి. మహబూబాబాద్, సంగారెడ్డి, జీహెచ్​ఎంసీ, నారాయణపేట, భూపాలపల్లి జిల్లాల్లో 7‌0 శాతానికి పైగా మొక్కలు నాటారు. రంగారెడ్డి, హెచ్​ఎమ్​డీఏ పరిధిలో 60 శాతానికి పైగా లక్ష్యం చేరుకోగా.. వరంగల్ పట్టణ జిల్లాలో నాటాల్సిన మొక్కల్లో సగం మాత్రమే పూర్తిచేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 64 శాతం మొక్కలకు జియోట్యాగింగ్ పూర్తైంది. ఈ ప్రక్రియలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. హెచ్​ఎండీఏ చివరి స్థానానికి పరిమితమైంది. శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాల్లో చాలా శాఖలు లక్ష్యాన్ని అధిగమించాయి. మొత్తం 53 శాఖల్లో 15.. వందశాతం లక్ష్యాన్ని అధిగమించాయి. మరో 25 విభాగాలు 50 నుంచి వందశాతం మధ్యలో ఉన్నాయి. మిగిలిన 13 మాత్రం నిర్దేశించిన లక్ష్యంలో సగం కూడా చేరలేదు.

ఇదీ చూడండి: హైదరాబాద్‌కు పచ్చందాలు... 75 ప్రాంతాల్లో చిట్టడువులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.