తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం హైదరబాద్ నగరంలో విజయవంతంగా కొనసాగుతోంది. మొక్కలు నాటాలి.. పచ్చదనాన్ని పెంచాలన్న నినాదంతో అధికారులు, నాయకులు మొక్కలు నాటడానికి ముందుకు వస్తున్నారు. గోషామహల్ నియోజకవర్గంలోని కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో తెరాస సీనియర్ నాయకులు ఆనంద్ కుమార్ గౌడ్, ఈఎన్టీ ఆర్ఎంవో జయ మనోరి ఆస్పత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు.
పచ్చదనం లేక.. పర్యావరణం పాడైపోయి.. మానవాళి మనుగడకే ప్రమాదం పొంచి ఉందని.. అందుకే ప్రతీ ఒక్కరు బాధ్యతాయుతంగా మొక్కలు నాటాలని తెరాస నేత ఆనంద్ కుమార్ గౌడ్ తెలిపారు. పచ్చదనంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలంటే.. అందరూ విధిగా మొక్కలు నాటి.. వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. మొక్కలు, చెట్లు ఎక్కడ ఉంటే.. అక్కడ ఆరోగ్యం ఉంటుందని, ఒక మొక్క నాటామంటే.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వేసిన ఒక అడుగు వేసినట్టే అని ఆర్ఎంవో జయ మనోరి అన్నారు.
ఇదీ చూడండి: విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'