అంకితభావం గుణాత్మక మార్పులకు నాంది పలుకుతుందని... రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. 'ట్రాన్స్ ఫార్మింగ్ స్టేట్ ఎఫెక్టివ్ నెస్ ఇన్ తెలంగాణ' అనే అంశంపై హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని అర్థగణాంక శాఖ కార్యాలయంలో జరిగిన సదస్సులో హరీశ్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, నీతి ఆయోగ్ సలహాదారుడు మురళీధరన్ కార్తికేయన్, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అర్థ గణాంక, ప్రణాళిక శాఖలు వివరాలను పక్కాగా సేకరించాలని హరీశ్‌రావు సూచించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్న వినోద్ కుమార్... రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఉద్యమకారులమైన తమకు తెలుసని వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ అనేక రంగాల్లో దేశంలోనే అగ్రభాగాన ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రణాళిక, అభివృద్ధిలో సమగ్ర కార్యాచరణ సేజిస్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హరీశ్‌రావు, వినోద్ కుమార్ సమక్షంలో అధికారులు, ప్రతినిధులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
ఇదీ చూడండి: "సర్కారు స్పందించలేదు.. సమ్మెపై వెనక్కి తగ్గేదిలేదు