Harish Rao Speech in Telangana Legislative Assembly : రాష్ట్ర శాసనసభ సమావేశంలోని తొలిరోజే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం గొంతు నొక్కి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. నిరసనకు కూడా అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేసుకుని పారిపోయిందని హరీశ్‌రావు ఆరోపించారు. గవర్నర్ ప్రసంగానికి(Governor Speech) ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాటలకు హరీశ్‌రావు మీడియాముఖంగా ఘాటుగా స్పందించారు.
రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ - శాసనసభలో వాడీవే'ఢీ' చర్చ
కాంగ్రెస్ నేతలు ఎన్నికల సభల్లో చెప్పినట్లే, శాసనసభలోనూ పూర్తిగా అబద్ధాలు చెబుతున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. ఉద్యమకారుల విషయంలో రేవంత్‌రెడ్డిది మొసలి కన్నీరని అన్నారు. నాడు పీవీ నర్సింహారావును దిల్లీ నాయకత్వం అవమానిస్తే, నోరు విప్పలేదని హరీశ్‌రావు అన్నారు. ఆనాడు టి.అంజయ్యను రాజీవ్‌గాంధీ(Rajiv Gandhi) ఎలా అవమానించారో మర్చిపోయారా అని ప్రశ్నించారు. సమైక్యవాదుల అడుగులకు మడుగులు ఒత్తింది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని హరీశ్‌రావు విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు ఉందా? మీ పేరే రైఫిల్ రెడ్డి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తుపాకీ పట్టుకొని, జై తెలంగాణ అన్నవాళ్లకు కాల్చి వేస్తానని చెప్పారు. ఉద్యమకారులపైకి తుపాకి గురిపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది. మీరు తెలంగాణ ఉద్యమకారులకోసం మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగున వ్యతిరేకించింది, సమైక్యవాదుల అడుగులకు మడుగులు ఒత్తింది మీరు. ఇవాళ నీకేదో ఉద్యమకారులపై ప్రేమ ఉన్నట్లు శాసనసభలో మొసలి కన్నీరు కారుస్తున్నావు.-హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Harish Rao Fires on Congress Party : తాము ప్రతి కార్యక్రమాన్ని అమరవీరులను తలుచుకుంటూనే, ప్రారంభించామని వివరించారు. త్యాగాలు ప్రతిక్షణం గుర్తించేలా అమరుల పేరిట సచివాలయం ఎదుట అద్భుత స్మారకం నిర్మించామని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత కాంగ్రెస్‌కు లేదని హరీశ్‌రావు పలికారు. వ్యవసాయ వృద్ధి(Agricultural Growth) రేటులో రాష్ట్రం రెండోస్థానంలో నిలిచిందని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ రైతుల ఆదాయం తక్కువ అని సభను ముఖ్యమంత్రి తప్పుదోవ పట్టించారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఏడాదిలో 24 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నదని, బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నట్లు వివరించారు. బీఆర్ఎస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు తగ్గుతూ వచ్చాయని, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఏడాదికి 1400 నుంచి 178కి తగ్గినట్లు గణాంకాల ద్వారా హరీశ్‌రావు వివరించారు.
Harish Rao on CM Revanth Reddy : రైతుబీమా విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు సమాచారం చెప్పారని, అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు. రైతు ఏ కారణంతో చనిపోయినా, బీమా పరిహారం(Insurance Compensation) చెల్లించినట్లు ఆయన వెల్లడించారు. పాలమూరుపై ప్రేమ ఉన్నట్లు రేవంత్ రెడ్డి ఏదో మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరును వలసలకు పేరుగా మారిస్తే, తాము పచ్చగా చేశామని హరీశ్‌రావు వెల్లడించారు.
'సీఎం రేవంత్ రెడ్డికి పంటల బీమాకు, రైతు బీమాకు తేడా తెలియదు'
ఇప్పుడైనా ఇతరులకు అవకాశం ఇస్తారనుకుంటే మళ్లీ వారే మాట్లాడుతున్నారు : రేవంత్ రెడ్డి