ETV Bharat / state

త్వరలో 1400 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ: హరీశ్​రావు - హైదరాబాద్ న్యూస్

Infection prevention and Awareness programme in hyd: హైదరాబాద్​లో పేట్లబురుజు ఆస్పత్రిలో ఇన్‌ఫెక్షన్ల నివారణపై కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు పాల్గొన్నారు. నిమ్స్​ ఆసుపత్రిలో 250, గాంధీలో 200 పడకలతో ఎంసీహెచ్‌ ఆసుపత్రులు తీసుకువస్తున్నామని మంత్రి తెలిపారు. త్వరలో 1400 వైద్య కళాశాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు.

Health Minister Harish Rao
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు
author img

By

Published : Feb 20, 2023, 2:50 PM IST

Infection prevention and Awareness programme in Hyd: మాతా శిశు మరణాల విషయంలో రాష్ట్రం చాలా మెరుగైందని అయినప్పటికీ మరణాలకు గల కారణాలపై లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. రాష్ట్రంలో మాతా శిశుసంరక్షణ ఆసుపత్రుల సంఖ్య పెంచుతున్నట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ పాతబస్తీలోని పేట్లబురుజు అసుపత్రిలో ఏర్పాటు చేసిన 'ఇన్‌ఫెక్షన్ల నివారణ- అవగాహన' కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు.

ప్రస్తుతం సగటున నెలకు 1400 ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే: మాతా శిశు మరణాల్లో ఒకప్పుడు ఐదు, ఆరు స్థానంలో ఉన్నామని చెప్పారు. ఏడాదికి లక్షకు 43 మాతాశిశు మరణాలతో ఇప్పుడు మూడో స్థానంలో ఉన్నామని మంత్రి వివరించారు. జాతీయ సగటుతో పోల్చుకుంటే మెరుగ్గా స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాలో 82శాతం ప్రసవాలు అంటే సగటున నెలకు 1400 ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగాయని మంత్రి వెల్లడించారు. ప్రసవం అయిన తర్వాత పూర్తిగా చెక్ చేసి పంపాలని ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయోమో పరిశీలించాలన్నారు.

1400 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ: ప్రాథమిక స్థాయిలోనే గర్భిణీల సమస్యలు గుర్తించగలిగితే మరణాల సంఖ్య తగ్గించవచ్చునని మంత్రి వివరించారు. నిమ్స్‌లో 250పడకలు, గాంధీలో 200 పడకలతో ఎంసీహెచ్‌ ఆసుపత్రులు తీసుకువస్తున్నామని మంత్రి ప్రకటించారు. కేసీఆర్ కిట్, మిడ్ వైఫరీ వ్యవస్థ, అమ్మ ఒడి వాహనాలు, న్యూట్రిషన్ కిట్ వంటి సదుపాయాలు గర్భిణీలకు కల్పించినట్లు తెలిపారు. త్వరలో 1400 వైద్య కళాశాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. దీంతో వైద్య సేవలు మరింత మెరుగవుతాయన్నారు.

మాతా శిశు మరణాల నియంత్రణ కోసం మరింత కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా నిలుపుదాం. మాతా శిశు మరణాలకు కారణాలను అన్వేషించి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. గిరిజన ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు లేక మరణాలు సంభవిస్తున్నాయని దీనిపై క్షేత్రస్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేశాం- హరీశ్ రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

త్వరలో 1400 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ: హరీశ్​రావు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.