ETV Bharat / state

వెన్నుపోటు కాంగ్రెస్‌ను నమ్ముకుంటే - గుండెపోటు గ్యారెంటీ : హరీశ్‌రావు

Harish Rao Comments on Karnataka Congress Government : కర్ణాటకలోని కాంగ్రెస్​ అన్ని రంగాల్లో విఫలమైందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. 6 నెలల క్రితం కర్ణాటక ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి.. ఇప్పుడు నరకం చూపిస్తోందని విమర్శించారు. దిల్లీ నేతల హామీలు నమ్మితే మోసపోవడం ఖాయమని అన్నారు.

Minister Harish Rao Latest Comments
Harish Rao on icc world Cup 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2023, 1:43 PM IST

Harish Rao Comments వెన్నుపోటు కాంగ్రెస్‌ను నమ్ముకుంటే.. గుండెపోటు గ్యారెంటీ

Harish Rao Comments on Karnataka Congress Government : కర్ణాటక కాంగ్రెస్​ ప్రభుత్వంపై మంత్రి హరీశ్​ రావు తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల క్రితం కర్ణాటక ప్రజలు చేసిన తప్పునకు.. ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. ఆరు నెలల క్రితం కన్నడ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్​ నేతలు.. ఇప్పుడేమో​ నరకం చూపిస్తున్నారని విమర్శించారు. ఆ రాష్ట్రంలో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్​ గాంధీ .. ఎన్నికల తర్వాత ఒక్కసారిగా కూడా వెళ్లలేదని వ్యాఖ్యానించారు. దిల్లీ నేతల హామీలను నమ్ముకుంటే మోసపోతారని రాష్ట్ర ప్రజలకు సూచించారు.

బూతులు మాట్లాడే ప్రతిపక్షాలకు పోలింగ్‌ బూత్‌లో ప్రజలు బుద్ధి చెబుతారు : హరీశ్​ రావు

Harish Rao Comments Congress Leader Chidambaram : కర్ణాటక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. ఇప్పటివరకు ఇవ్వలేదని హరీశ్​ రావు అన్నారు. కర్ణాటకలో ఉన్న పథకాలకే కోత పెడుతున్నారని.. అక్కడ రోడ్లు వేయడానికే డబ్బులు లేవని డీకే శివకుమార్‌ అన్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పాలనలో కర్ణాటక దివాలా తీసిందని(Harish Rao Comments on Karnataka Government) వ్యాఖ్యానించారు.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో 350 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని హరీశ్ రావు తెలిపారు. వెన్నుపోటు కాంగ్రెస్‌ను నమ్ముకుంటే.. గుండెపోటు గ్యారెంటీ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమాన్ని చిన్నది చేసేలా కాంగ్రెస్​ నాయకుడు చిదంబరం మాట్లడారని మండిపడ్డారు. చిదంబరం చెప్పిన సారీ.. అణుబాంబు వేసిన అమెరికా.. జపాన్​కు సారీ చెప్పినట్లుందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్​కు ఓటు వేస్తే మూడు గంటల కరెంటును అనుమతించినట్లే : హరీశ్​రావు

"కాంగ్రెస్‌ పాలనలో కర్ణాటకఅన్ని రంగాల్లో విఫలమైంది. ఆరు నెలల క్రితం చేసిన తప్పునకు కర్ణాటక ప్రజలు బాధపడుతున్నారు. కర్ణాటకలో ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.. ఇవ్వలేదు. ప్రజలకు కాంగ్రెస్‌ నరకం చూపిస్తోంది. వెన్నుపోటు కాంగ్రెస్‌ను నమ్ముకుంటే.. గుండెపోటు గ్యారెంటీ."- హరీశ్​ రావు, ఆర్థిక శాఖ మంత్రి

Harish Rao on Telangana Development : నేను రైతును అని గర్వంగా చెప్పుకునే స్థితికి తెలంగాణను కేసీఆర్‌ తీసుకొచ్చారని హరీశ్​రావు అన్నారు. కర్ణాటకలో రైతుబంధు ఇవ్వడం లేదని.. తెలంగాణలో అమలు అవుతుందని చెప్పారు. నవంబర్​ 19న ఇండియా మూడో సారి వరల్డ్​కప్​ కొడుతుందని.. అదే విధంగా రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్​ హ్యాట్రిక్​ ఖాయమని జోస్యం చెప్పారు. కర్ణాటకలోని గ్రామాల్లో నీళ్లు రావడం లేదని.. తెలంగాణలో ప్రతి పల్లెలోను నీళ్లు పుష్కలంగా లభిస్తున్నాయని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వచ్చి రాష్ట్రంలో ప్రచారం చేస్తే హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.

అసైన్డ్‌ భూములకు పట్టాలు కావాలంటే కారు గుర్తుకు ఓటేయండి : హరీశ్​రావు

12 సార్లు మీరు కాంగ్రెస్​ను గెలిపించారు కానీ వారు ఇక్కడ చేసిందేమిలేదు : హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.