తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన పెంచేందుకు హరే కృష్ణ మెంట్ వారు హెరిటేజ్ ఫెస్ట్ పేరిట ప్రతిభ పోటీలు నిర్వహించబోతున్నారు. అందులో భాగంగా నేడు బంజారాహిల్స్లో ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని మహానగరంలో వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. గతేడాది ఈ పోటీలకు 18 వేల మంది విద్యార్థులు హాజరుకాగా... ఈ ఏడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి పాఠశాలల నుంచి 30 వేల మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలకు అన్ని పాఠశాలల పిల్లలు అర్హలేనని... ఆసక్తి ఉన్న వారు ఉచితంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: ప్రగతిభవన్లో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం