హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో గౌరపూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లకీ ఉత్సవం జరిపి... అనంతరం స్వామివారికి 108 కలశాల మహాభిషేకం చేశారు. స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి... మహా మంగళ హారతి కార్యక్రమం నిర్వహించారు. భక్తులు ఏకకంఠంతో జరిపిన హరినామ సంకీర్తన ఆబాలగోపాలాన్నీ తన్మయత్వంలో ఓలలాడించాయి.
ఇదీ చూడండి: యాదాద్రి ఆలయంలో మరో 32 మంది సిబ్బందికి కరోనా