Harassment of BTech girl with nude videos at Hyderabad : సోషల్ మీడియా వచ్చి ప్రచార మాధ్యమంలో సరికొత్త విప్లవం తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగిన ఇట్టే తెలిసిపోతుంది. దానికి మనం చేయాల్సింది ఒకటే.. మన అర చేతిలో సెల్‌ఫోన్ పెట్టి దాని డేటా ఆప్షన్ ఆన్ చేయడమే. దీని వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఎక్కడో అంట్లాటిక్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక చిత్రాలను చూస్తున్నాం. అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాముల గురించి తెలుసుకుంటున్నాం.
మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా అనేక పరిచయాలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు పరిచయం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలంటేనే మెలికలు తిరిగిపోయో వాళ్లం. అలాంటింది సోషల్ మీడియా పుణ్యమా అని పరిచయం ఉన్నా.. లేకున్నా అనవసరం ప్రతి ఒక్కరితో మెసేజ్‌లతో దగ్గరవ్వడం.. ఆ తరువాత పర్సనల్ ఫోన్ నెంబర్ తీసుకుని వారితో ఇష్టాను రీతిగా సంబంధాలు కలిపేయడం మామూలైపోయింది.
చివరికి వారిలో కొందరు మనల్ని మోసం చేశారు అని గ్రహించే సరికి మన జీవితం సర్వ నాశనం అయిపోవడం జరుగుతోంది. ఇలా అనేక మంది యువతి, యువకులు తమ జీవితాలను తెలియని వ్యక్తులతో పరిచయం పెంచుకుని జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటే ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. స్నాప్‌చాట్ ద్వారా పరిచయమైన ఓ యువకుడు యువతికి దగ్గరై.. ఆమె న్యూడ్ ఫోటోలతో వేధింపులకు దిగాడు. చివరికి ఆమె ధైర్యం చేసి మహిళ సంఘాలను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఇది జరిగింది: న్యూడ్ వీడియోలతో యువతిని వేధించిన ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. బాధితురాలు కథనం ప్రకారం.. హైదరాబాద్‌లో బీటెక్ చేస్తోన్న యువతికి సామాజిక మాధ్యమం స్నాప్‌చాట్ ద్వారా అలీ అనే యువకుడు పరిచయమయ్యాడు. యువతితో పరిచయం పెంచుకున్న సదరు యువకుడు ఆమెతో మాట్లాడిన ఫోన్ సంభాషణలు, వీడియో కాల్స్‌ను తన దగ్గర ఉంచుకున్నాడు. ఈ క్రమంలో ఆ అమ్మాయి యువకుడ్ని దూరం పెట్టడంతో వీడియోకాల్ స్క్రీన్‌షాట్లతో యువకుడు బెదిరింపులకు దిగాడు.
కోరిక తీర్చకపోతే ఫోటోలు వైరల్ చేస్తానని హెచ్చరించాడు. దీంతో బాధితురాలు భయంతో హిందూ సంఘాలను ఆశ్రయించింది. యువతి ఇచ్చిన సమాచారంతో అలీని హిందూ సంఘాలు పట్టుకున్నారు. అనంతరం షీ టీమ్స్‌కు యువతి ఫిర్యాదు చేసింది. పలువురు యువతులను ఇదే విధంగా అలీ మోసం చేస్తున్నాడని యువతి ఆరోపిస్తోంది.
మరోవైపు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఇలాంటి ఘటనలపై యువతి, యువకులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పరిచయం లేని వ్యక్తులతో ఇలా మాట్లాడటం.. వారికి మన ఫోన్ నెంబర్‌తో పాటు బ్యాంక్ అంకౌంట్ వివరాలు ఇవ్వడం చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాటిపై తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు తగు జాగ్రత్త చర్యలు సూచించాలని పేర్కొంటున్నారు.
ఇవీ చదవండి: