జైళ్లలో ఖైదీలకు కరోనా వ్యాప్తి చెందకుండా... సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రొఫెసర్ హరగోపాల్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జైళ్లల్లో ఖైదీలకు కరోనా సోకకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసి.. వారం గడిచినా రాష్ట్రంలో అమలు కావడం లేదని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమించిన కమిటీ చేసిన సూచనలు కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 47 కారాగారాల్లో పరిమితికి మించి ఖైదీలు, విచారణ ఖైదీలు ఉన్నారని.. వసతులు కూడా సరిగా లేనందున.. కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉందని హరగోపాల్ పేర్కొన్నారు. కాబట్టి తగిన చర్యలు తీసుకోవడంతో పాటు.. జైళ్లలో ఉన్న సామాజిక కార్యకర్తలు, చిన్న నేరాలకు పాల్పడిన వారిని విడుదల చేయాలని ఆయన కోరారు. హరగోపాల్ పిటిషన్పై నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టనుంది.
ఇవీ చూడండి: తెలంగాణలో 154కు చేరిన కరోనా కేసులు