హైదరాబాద్ అబిడ్స్‌లోని స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సమావేశ మందిరంలో నిర్వహించిన టీపీయూఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా హనుమంతరావు, ప్రధాన కార్యదర్శిగా నవాజ్ సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకీకృత సర్వీస్ అమలు చేసి... పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని నూతన అధ్యక్షుడు హనుమంతరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి... పీఆర్సీ ప్రకటించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
ఇదీ చూడండి: అక్టోబర్‌లో రికార్డు స్థాయికి.. యూపీఐ లావాదేవీలు