చేనేత వస్త్రాలను ప్రోత్సహించి చేనేతకారులకు జీవనోపాధి కల్పించేందుకు కృషి చేస్తామని తెలంగాణ హ్యాండ్‌క్రాప్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ సంపత్‌కుమార్ గుప్త అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని గోల్కొండ హ్యాండ్‌క్రాప్ట్స్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాలైన ఉత్పత్తులను పరిశీలించి వినియోగదారులకు పలు సూచనలు చేశారు. చేనేత కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ కల్పించి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈనెల 9 వరకు ఈ ప్రదర్శన అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు.
ఇవీ చూడండి: చలనచిత్ర విప్లవ యోధాగ్రణి ఆర్. నారాయణమూర్తి