కూరగాయలను కోసిన తర్వాత చేతులు నల్లగా మారుతున్నాయా? ఈ సమస్యకు పరిష్కారం చాలా సులువండీ. నిమ్మరసం, బంగాళాదుంప, ఉప్పునీళ్లు.. వీటిలో ఏదైనా ఉపయోగించి మీ సమస్యకు చెక్ పెట్టేయోచ్చు.
Lemon uses, potato uses, kitchen tips
By
Published : May 16, 2021, 1:13 PM IST
దొండకాయలు, వంకాయలు లాంటి కూరగాయలను కోసిన తర్వాత చేతులు నల్లగా మారతాయి. ఇలాంటప్పుడు ఆ మరకలను తొలగించాలంటే ఏం చేయాలో చూద్దామాా..
నిమ్మరసంతో..
ఎలాంటి మరకలనైనా పోగొట్టడంలో నిమ్మ ముందుంటుంది. ముఖ్యంగా వంకాయలు, దొండకాయలు కోసినప్పుడు చేతివేళ్లు నల్లగా మారతాయి. అలాంటప్పుడు ఓ పాత్రలో నీళ్లు తీసుకుని వేడి చేయాలి. ఈ నీటిలో రెండు చెంచాల నిమ్మరసం వేసి కలపాలి. నీళ్లు కాస్త చల్లారిన తర్వాత చేతివేళ్లు నీటిలో మునిగేలా పెట్టాలి. ఇలా దాదాపు అయిదు నిమిషాలపాటు పెడితే మరకలు, మచ్చలు అన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు చేతులను లిక్విడ్ సోప్‌తో కడుక్కుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
బంగాళాదుంపతో...
కూరగాయలు కోసినప్పుడు చేతివేళ్లపై ఏర్పడే నల్ల మరకలను ఆలుగడ్డ రసం క్షణాల్లో దూరం చేస్తుంది. మీరు చేయాల్సిందల్లా బంగాళాదుంపను సగానికి కోసి ఆ ముక్కతో నల్లగా ఉన్నచోట్ల రుద్దితే సరిపోతుంది.
ఉప్పునీళ్లు...
వేడినీటిలో కాస్తంత ఉప్పు వేసి కలపాలి. అరటికాయ, బొప్పాయి, పనస పొట్టు కూరగాయలను కోయడం వల్ల ఏర్పడిన మరకలను ఈ నీళ్లు పోగొడతాయి.