Half Kilo Gold Chori Case in Hyderabad : ఇంటి యాజమానులు, సభ్యులు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందనేందుకు ఈకింది ఘటనే ఓ ఉదాహరణ. ఓ ఇంటి యాజమాని తన ఇంటి బీరువాలో బంగారాన్ని దాచుకున్నాడు. అయితే ఆ బీరువా కీ కనిపించలేదని డూప్లికేట్ తాళం చేద్దామని నిర్ణయించుకున్నాడు. అక్కడే తాను తప్పటడుగు వేశాడు.
తాళం చెవి చేసే వ్యక్తులను తమ ఇంటికి ఆహ్వానించి బీరువా డూప్లికేట్ కీ(Duplicate Key) చేయమని చెప్పాడు. వారు కీ చేసేందుకు ప్రయత్నించి చివరికి చేయలేమని చెప్పి వెళ్లిపోయారు. దీంతో నిరాశ చెందిన ఇంటి యజమానికి కొన్ని రోజులకు మరో వ్యక్తితో బీరువా తెరిపించాడు. సీన్ కట్ చేస్తే అందులో ఉండాల్సిన బంగారం కనిపించలేదు. వెంటనే లబోదిబోమంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
ఆలయాల్లో హుండీ చోరీ - సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు
Gold Theft Complaint Madhuranagar Police Station : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌లోని మధురానగర్‌లో కల్యాణ్‌నగర్ ఫేజ్-1 ప్రాంతానికి చెందిన సూర్యనారాయణ రాజు (75) ఇంట్లో శుభకార్యం ఉండటంతో బ్యాంకు లాకర్‌లో భద్రపర్చిన సుమారు 488 గ్రాముల బంగారు ఆభరణాలను నవంబర్ నెలలో తీసుకొచ్చారు. శుభకార్యం అయిపోయాక వాటిని చిన్నపాటి చెక్కపెట్టెలో పెట్టి అల్మారాలో భద్రపర్చారు. తిరిగి బ్యాంకు లాకర్‌లో పెడదామని తాళాలు వెతకగా కనిపించలేదు. అనంతరం వేరే కీ చేసేందుకు మధరానగర్‌లో కనిపించిన 55, 35 వయస్సు ఉన్న ఇద్దరి వ్యక్తులను ఇంటికి తీసుకువచ్చాడు.
ఎంత ప్రయత్నించినా అల్మారా తెరుచుకోకపోవడంతో.. మరుసటిరోజు వస్తామని వారిద్దరూ వెళ్లిపోయారు. మరుసటి (డిసెంబరు 10న) రోజు వచ్చి అల్మారా తెరవడానికి మళ్లీ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇంట్లో సభ్యుల దృష్టి మార్చేందుకు నీళ్లు కావాలని వారు కోరారు. అనంతరం తాళం జామ్ కావడంతో తెరచుకోవడం లేదని చెప్పి, కిరాయి రూ.200 తీసుకొని వెళ్లిపోయారు.
షో రూంలో దొంగతనం - లాకర్ బరువుందని చెత్తలో వదిలేసిన దొంగలు
Half Kilo Gold Chori Case : కొద్ది రోజులకు ఇంట్లో పోయిన తాళంచెవి యజమాని రాజుకు కనిపించింది. దీంతో అల్మారా తెరవడానికి ప్రయత్నించగా తెరుచుకోలేదు. డిసెంబరు 16న యూసుఫ్‌గూడ ప్రాంతంలో బీరువా తాళం మరమ్మతులు చేసే మరోవ్యక్తిని ఇంటికి తీసుకొచ్చారు. ఆయన మరమ్మతులు చేసి అల్మారా తెరవగా, బంగారు ఆభరణాలు(Gold Theft) కనిపించలేదు. దీంతో డూప్లికేట్ తాళాలు తయారు చేసేందుకు మొదట వచ్చిన వారిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు యజమాని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆకతాయి ఒక్కడంట చిల్లరంత మూట గట్టి - దూకేను గోడలంట దుమ్ముకొట్టి కళ్లలోన దొంగ దొంగ
Delhi Gunpoint Robbery : పెట్రోల్ బంక్‌లో దుండగుల హల్చల్.. సిబ్బంది తలకు గన్ పెట్టి నగదుతో పరార్